![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -413 లో....రాజ్ ఇంటికి రాగానే.. కావ్య కిడ్నాప్ అయిన విషయం అప్పు చెప్తుంది. అయిన మీరు అక్కడికి ఎందుకు వెళ్లారంటూ రాజ్ కోప్పడగా.. మాయ కోసం వెళ్ళామని అప్పు చెప్తుంది. ఇప్పుడు అదంతా కాదు ముందు వెళ్లి అక్కని కాపాడాలని అప్పు అంటుంది. మరొకవైపు కావ్యతో ఇంక కొంతమంది అమ్మాయిలని రౌడీలు ఓ రూమ్ లో బంధిస్తారు. రౌడీ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడడం కావ్య విని.. ఎలాగైనా ఇక్కడ నుండి తప్పుంచుకోవాలనుకుంటుంది.
ఆ తర్వాత రాజ్ ఇన్స్పెక్టర్ తో ఫోన్ లో మాట్లాడతాడు. కార్ డీటెయిల్స్ అన్ని పంపించానని త్వరగా కనుక్కోండని చెప్తాడు...రాజ్ టెన్షన్ పడుతుంటే.. బావ మీరేం టెన్షన్ పడకండి.. అక్కకి ఏం కాదని అప్పు అంటుంది. ఏం కాదని నువ్వు ఎలా చెప్తావని రాజ్ సీరియస్ అవుతాడు.. ఆ తర్వాత అక్కడ నుండి ఎలా బయటపడాలో కావ్య అక్కడున్న అమ్మాయిలకి చెప్తుంది. మరొకవైపు ఇన్స్పెక్టర్ రాజ్ కి కాల్ చేస్తాడు. మీరు చెప్పిన కార్ నెంబర్ బట్టి ట్రేస్ చేస్తే కార్ మల్కాజిగిరి దగ్గర ఆగింది. కార్ నడిపేది జేమ్స్.. వాడు సిటీలో ఒంటరిగా దొరికిన అమ్మాయిలని తీసుకొని వెళ్లి దుబాయ్ కి అమ్ముతాడు.. వాడి కోసం ఆరు నెలలుగా వెతుకుతున్నాం.. ఇప్పుడు మీ వల్ల క్లూ దొరికింది. రెండు రోజుల్లో పట్టుకొకపోతే దుబాయ్ కి అమ్మేస్తాడని రాజ్ కి ఇన్ స్పెక్టర్ చెప్తాడు. ఈ లోపు ఎలాగైనా పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అక్కపై అంత ప్రేమ పెట్టుకొని ఎప్పుడు కోపంగా ఉంటావేంటి బావ అని అప్పు అడుగుతుంది. మరొకవైపు రౌడీ ని డైవర్ట్ చేసి.. అతని ఫోన్ నుండి రాజ్ కి కావ్య మెసేజ్ చేసి.. లొకేషన్ షేర్ చేస్తుంది. ఆ విషయం రౌడీ చూసి ఇలా ఎందుకు చేసావంటూ కావ్యపై కోప్పడతాడు. చేశాను ఇప్పుడు నా భర్త వచ్చి మీ సంగతి చెప్తాడని ఆ రౌడీని కావ్య బెదిరిస్తుంది. మిగతా రౌడీలకి లొకేషన్ షేర్ చేసిందని చెప్తాడు. ఆ తర్వాత రౌడీలు కిడ్నాప్ చేసిన వాళ్ళ నోటికి ప్లాస్టర్ వేస్తారు.
ఆ తర్వాత రాజ్ అప్పు లొకేషన్ కి వస్తారు. అక్కడ రౌడీలు ఏం కావాలంటూ అడుగుతారు.. చుట్టూ చూసి ఎవరు లేకపోవడంతో రాజ్ అప్పు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రౌడీలు వాళ్లని కార్ లో బలవంతం గా ఎక్కించుకొని వెళ్తుంటే.. రాజ్ ఎదరుగా ఉంటాడు. వెనకాల నుండి పోలీసులు వస్తారు. ఆ తర్వాత కావ్య వచ్చి.. రాజ్ ని హగ్ చేసుకుంటుంది. థాంక్స్ సర్ మీ వల్ల ఇంత మంది సేవ్ అయ్యారని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అయిన వాళ్ళు ఇటే వస్తారని ఎలా తెలుసు బావ అని అనగానే.... కావ్య చెవికమ్మ చూపిస్తూ.. రౌడీ ల దగ్గర నుండి వస్తుంటే అక్కడ చెవికమ్మ దొరికిన విషయం చెప్తాడు.. ఆ తర్వాత రాజ్ కావ్య, అప్పు కలిసి ఇంటికి బయలుదేర్తారు. తరువాయి భాగంలో అసలు ఆ మాయకి న్యాయం కావాలంటే అలా చేస్తుందా బిడ్డని వదిలేసి వెళ్తుందా అని రాజ్ తో కావ్య అనగానే.. నువ్వు ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక ఏం చెయ్యకు.. ప్రాబ్లమ్ క్రియేట్ చెయ్యకని కావ్యతో రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |